'వైయస్‌ఆర్‌ హయాంలో బలపడిన సొసైటీలు'

విశాఖపట్నం : దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ సహకార సంఘాలకు పరిపుష్టి కల్పించారని వైయస్‌ఆర్‌సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా మునగపాకలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారంనాడు కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సహకార సంఘాల బలోపేతానికి‌ మహానేత వైయస్ ఎంతో కృషి చేశారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రుణ మాఫీ, సక్రమంగా రుణాలు చెల్లించిన రైతులకు బోనస్ ‌లాంటి సదుపాయాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు పక్షపాతిగా డాక్టర్ వై‌యస్ నిలిచారన్నారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని కొణతాల అన్నారు. యలమంచిలి నియోజకవర్గంలోని పార్టీ నేతలతో సహకార ఎన్నికలపై ఆయన ఆరా తీశారు.
Back to Top