వైయస్‌ఆర్ డిసిసిబి చైర్మన్‌గా తిరుపాల్‌రెడ్డి ఏకగ్రీవం

వైయస్‌ఆర్ జిల్లా‌, 28 ఫిబ్రవరి 2013: క‌డ‌ప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలికిన తిరుపాల్‌రెడ్డి గురువారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసిసిబి ఎన్నిక ప్రక్రియ పూర్తవడంతో గత కొద్ది రోజులుగా దీనిపై నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకర పరిస్థితులకు తెరపడినట్లయింది. తిరుపాల్‌రెడ్డి ఆ వెంటనే డిసిసిబి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. డిసిసిబి వైస్‌చైర్మన్‌గా ఆంజ‌నేయులు యాద‌వ్ ప్రమాణ‌‌ స్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మ‌ద్దతుదారులు, నాయకులు పెద్ద మొత్తంలో హాజ‌రయ్యారు. కాగా, డిసిసిబి చైర్మన్‌ పదవి ఎలాగైనా చేజిక్కించుకోవాలని శత విధాలా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వర్గానికి చెందిన డిసిసిబి డైరెక్టర్లు ఈ ఎన్నికలకు ప్రక్రియకు హాజరు కాలేదు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top