'వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన సాధ్యం'

తిరుమల, 4 జూన్ 2013:

ప్రజాపాలన అందించడం ఒక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే సాధ్యం అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తరఫున రాజంపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున అమర్‌నాథరెడ్డి మంగళవారం ఉదయం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top