వైఎస్సార్‌సీపీలోకి 500 మంది

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 500 మంది కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా నేత ఎల్‌ఎం మోహన్‌రెడ్డి సమక్షంలో కొల్లప్ప, హనుమేష్, ఆనంద్, హనుమంతరాయుడు, కోట్ల ఈరన్న, ముసలప్ప, గంగాధర్, రమేష్, భాస్కర్, నాగరాజు, సత్తి, బాబు, రామాంజినేయులు, కోట్ల హనుమంతరాయుడు, కోట్ల శివన్న, దాణీ లక్ష్మన్న, వన్నూరప్ప, వీరేంద్ర, నాగభూషణ, రాము, చంద్రయ్య, గొర్ల హనుమంతరాయుడు, వన్నప్ప, ఆశోక్, యశోదమ్మ, ఆంజినమ్మ, లక్ష్మిదేవి, అలివేలమ్మ, గౌరమ్మ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని ఎల్‌ఎంతోపాటు వైయస్ఆర్ సీపీ నేతలు మార్కెట్ రామన్న, దాదాఖలందర్, ములకనూరు గోవిందు తదితరులు కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్‌ఎం మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైయస్ఆర్‌ సీపీ పని చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో అన్నం పెట్టే రైతులను అడుక్కునే స్థితికి తెచ్చారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలే శారని విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా అణగదొక్కేందుకూ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం పట్టని పార్టీలకు బుద్ధి చెప్పే సమయంఆసన్నమైందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగించాలన్నా, సువర్ణ యుగం రావాలన్నా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గరుడాపురం పంచాయతీలో పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు జీఎం. ఖాన్, శ్యామంత్, బసిరెడ్డి యాదవ్, సంజీవచౌదరి, ఎర్రంపల్లి సిద్ధ తదితరులు పాల్గొన్నారు.

జగన్ విడుదలకు హోమం
రాజమండ్రి: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలవ్వాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ మంజూరు కావాలని శుక్రవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద గణపతి సమేత సకల దేవతా హోమం నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, ప్రత్యేక ఆహ్వానితుడు ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు. యువజన నాయకుడు జక్కంపూడి రాజా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గారపాటి ఆనంద్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ నరవ గోపాలకృష్ణ, మహిళా విభాగం కన్వీనర్ లక్ష్మీచక్రవర్తి, లీగల్‌ సెల్ కన్వీనర్ ఉమామహేశ్వరి, సేవాదళ్ కన్వీనర్ బిల్డర్ చిన్నా, ఎస్సీ విభాగం కన్వీనర్ కడితి జోగారావు, వికలాంగుల విభాగం కన్వీనర్ సబ్బెళ్ల విజయ దుర్గారెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు పడాల ప్రసాద్, నరేష్‌కుమార్, నాయకులు జక్కంపూడి గణేష్, పోలు కిరణ్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విక్రమ్‌హాలు సమీపంలోని చర్చిలో కూడా పార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ముస్లింల ప్రార్థనలు
హైదరాబాద్: నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకుసాగుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ శుక్రవారం కేపీహెచ్‌బీ జామియా మసీదులో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ముస్లిం యువ నేత ఎస్.డి.యూనస్ మాట్లాడుతూ... కుట్రలు, కుతంత్రాలతో జగన్ ప్రజల నుంచి దూరం చేయలేరన్నారు. వైయస్ఆర్ సీపీ నేతలు అంకాల రాజు, విజయభాస్కర్‌రెడ్డి, జార్జ్ కె. హెర్బెట్, కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, అబ్బుల్‌మొబిన్, హయత్, మసుద్, రాణాప్రతాప్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మనోజ్, భగవాన్‌రాజు, ప్రసాద్, జయశంకర్‌రెడ్డి, అనిల్ ముదిరాజ్, వివేక్‌రెడ్డి, అడెన్నా, విజయ్, రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, హరీష్, ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు.మిట్టపల్లిలో 150 మంది చేరిక:  మిట్టపల్లికి చెందిన 150 మంది బీసీ, మైనార్టీ యువకులు, మహిళలు శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ నేతలు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, డాక్టర్ నాగేంద్రకుమార్‌రెడ్డి సమక్షంలో వెంకటస్వామి, చాంద్‌బాషా, కలీముల్లా, నాగేంద్ర, శివమ్మ, సూరి, పారేశప్ప, గంగులప్ప, మనోహర్, చంద్ర, బాబ్‌జాన్, ఖాసీంఖాన్, నాగులమ్మ, చెన్నమ్మ, సాకమ్మ, వెంకటలక్ష్మమ్మ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాయకులు మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గొప్ప నేత  రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఆనాడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని వైయస్ అంటే బట్టలు ఆరేసుకోవచ్చని హేళన చేసిన చంద్రబాబు ‘వస్తున్నా.. మీ కోసం’ పేరుతో పాదయాత్ర చేపడుతుంటే ప్రజలు మాత్రం ‘పోతున్నాం.. జగన్ వెంట’అని అంటున్నారన్నారు. కార్యక్రమంలో మండల వైయస్ఆర్‌ సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యుడు ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మైనారిటీ సెల్ కన్వీనర్ వెల్డింగ్ బాషా, మాజీ సర్పంచ్ వెంకటరంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ అశ్వర్థరెడ్డి, నాయకులు షామీర్ బాషా, నరసింహులు,చిన్నప్పయ్య, కరీం, ఆదినారాయణ, ఆదిశేఖర్, గోవిందరెడ్డి పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top