వేల మంది వెంట రాగా 62వ రోజు మరో ప్రజాప్రస్థానం

మర్రిగూడ (నల్గొండ జిల్లా), 10 ఫిబ్రవరి 2013: వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు వెంట నడుస్తుండగా వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల తన 62వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు. నల్గొండజిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ వద్ద శనివారం రాత్రికి బస చేసిన శ్రీమతి షర్మిల ఆదివారం ఉదయం అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజున శ్రీమతి షర్మిల సుమారు 15 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తారు.

 శ్రీమతి షర్మిల పాదయాత్ర రామిరెడ్డిపల్లి, గునగల్ క్రా‌స్రో‌డ్సు, సరంపేట, పుల్లనిగుంట, లంకలపల్లి మీదుగా కొనసాగుతుంది. రాత్రికి లంకపల్లి శివారులో ఆమె బస చేస్తారు.
Back to Top