వాడ‌వాడ‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌చారం

కాకినాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి కాకినాడ న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. వాడ‌వాడ‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఉత్సాహంగా ప్ర‌చారం చేస్తున్నారు. గురువారం న‌గ‌రంలో వ‌ర్షం కురిసినా కూడా పార్టీ అభ్య‌ర్థులు ఇంటింటి ప్ర‌చారం చేప‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ముత్తా శ‌శిధ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఆయా డివిజ‌న్ల‌లో ప్ర‌చారం చేశారు. 12వ డివిజ‌న్‌లో మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఎమ్మెల్యే రాజ‌న్న దొర‌, కంబాల జోగులు పాల్గొన్నారు. 49వ డివిజ‌న్‌లో పార్టీ జిల్లా అధ్య‌క్షుడు క‌న్న‌బాబు,  కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ ప్ర‌చారం చేశారు. 44వ డివిజ‌న్‌లో వ‌ర్షంలోనే పార్టీ అభ్య‌ర్థి గంగ ర‌త్నం ఇంటింటా ప‌ర్య‌టించి ఓట్లు అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ..ప్ర‌తి డివిజ‌న్‌లోనూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ప్ర‌చారానికి మంచి స్పంద‌న వ‌స్తుంద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీకి  ప్రజల్లో ఉన్న ఆదరణ, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వంటి అంశాలు పార్టీని విజయం వైపు నడిపించగలవన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ఎండ‌గ‌డుతున్నామ‌ని చెప్పారు.  ప్రతి గడపకు వెళ్లి నవరత్న పథకాలను వివ‌రిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు.

Back to Top