వడగళ్ళ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

కరీంనగర్, 17 ఫిబ్రవరి 2013: కరీంనగర్‌ జిల్లాలో వడగళ్ల వాన సృష్టించిన బీభత్సాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు ఆది శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని మేడిప‌ల్లి, కోరుమల్ల, కట్లకుంట, తొంబర్‌రావుపేటలో పంట నష్టాన్ని శ్రీనివాస్ పరిశీలించారు.‌ మామిడి రైతులకు 2011లో జరిగిన పంట నష్టపరిహారం ఇంతవరకూ అందలేదని ఆది శ్రీనివాస్ ‌అన్నారు. పంట నష్ట‌పోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో‌ పంటలు నష్టపోయిన రైతులను శ్రీనివా‌స్ పరామర్శించారు.
Back to Top