వారివి దివాళాకోరు రాజకీయాలు

రాయదుర్గం:

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబునాయు డు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నిం చారు. ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట ప్రభుత్వం మొదటి త్రైమాసికానికి రూ. 1,740 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్తు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదనీ, మరో ఐదేళ్లు చార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందనీ ఆయన మండిపడ్డారు.
ఒక్క రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, నగదు బదిలీ పథకం పేరుతో పేదల కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తెల్లరేషన్‌కార్డుల రద్దు, ఫీజు రీయింబర్స్ చేయకపోవడం, వంట గ్యాస్ ధర పెంపుతో పాటు సిలిండర్లపై పరిమితి విధించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబి స్తోం దని దుయ్యబట్టారు.

Back to Top