వాడపల్లినుంచి మొదలైన మరో ప్రజాప్రస్థానం

నల్గొండ 23 ఫిబ్రవరి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను శనివారం ఉదయం ప్రారంభించారు. తొలుత ఆమె దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. నల్గొండ జిల్లా వాడపల్లిలో యాత్రను మొదలుపెట్టారు. వాడపల్లి వంతెన మీదుగా పొందుగుల గ్రామం వద్ద గుంటూరు జిల్లాలోకి యాత్ర అడుగిడనుంది. గుంటూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 300 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర సాగుతుంది. శనివారం ఆమె 9 కిలోమీటర్ల దూరం నడుస్తారు. రాత్రికి పులిపాడు క్రాస్ వద్ద ఆమె బస చేస్తారు. ఈ నెల18నే పాదయాత్ర గుంటూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక రోజు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు, తదుపరి హైదరాబాద్‌లో సంభవించిన బాంబు పేలుళ్లలో మృతులకు సంతాప సూచకంగా ఒకరోజు యాత్రను వాయిదా వేసుకున్నారు.

Back to Top