బాబుకు కౌంట్ డౌన్ మొదలైందిః ఉషా చరణ్

రైతుధ‌ర్నా:  అనంత‌పురంలో అస‌లు క‌రువ‌న్న‌దే లేద‌న్న చంద్ర‌బాబు ...ఇవాళ రైతుధ‌ర్నాలో పాల్గొన్న వేలాది మంది క‌రువు రైతుల‌ను చూసైనా బుద్ధి తెచ్చుకోవాల‌ని క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌వ‌క‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఉషా చరణ్ అన్నారు. రైతుధ‌ర్నాలో ఆమె మాట్లాడుతూ... ఆరు రెయిన్‌గ‌న్‌ల‌ను ఇచ్చాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు నీరు లేన‌ప్పుడు రెయిన్‌గ‌న్‌ల‌ు ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రైతుల‌కు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తాన‌న్న హామీ గంగ‌లో క‌లిసింద‌న్నారు. 

 రైతుల‌కు భీమా సౌక‌ర్యం క‌ల్పించ‌కుండా, ఇన్‌ఫుట్ స‌బ్సిడీ ఇవ్వ‌కుండా రైతుల‌ను అదోగ‌తి పాలు చేస్తున్నాడ‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. బాబు రెండున్న‌రేళ్ల పరిపాల‌న‌లో రైతుల‌ను మోసం చేస్తూనే ఉన్నార‌ని మండిప‌డ్డారు. ఎప్పుడు ఎన్నిక‌ల వ‌స్తాయా... జ‌గ‌న‌న్న‌కు ఎప్పుడు ఓటు వేయాల‌ని  ప్ర‌జ‌లంద‌రు అడుగుతున్నార‌ని ఆమె చెప్పారు. బాబు ప్ర‌భుత్వానికి కౌంట్‌డౌన్ మొద‌లైంద‌ని.... రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న‌తోనే సాధ్య‌మ‌ని, 2019లో వైయ‌స్సార్‌సీపీ అధికారంలో రావ‌డం త‌థ్యమ‌న్నారు.
Back to Top