ఉత్తుత్తి మహానాడులు: కాకాణి

కావలి: అధికారంలోకి
వచ్చి రెండు సంవత్సరాలు అయినా ప్రజలకు ఏమి చేయలేదని ఓట్లు వేసిన ప్రజలే టీడీపీని
చీదరించుకుంటున్నారని వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా
అధ్యక్షులు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. టీడీపీ ఏర్పాటు
చేసిన మహానాడులు ఉత్తుత్తివని అభివర్ణించారు. రాష్ట్రంలో
ఏమి అభివృద్ధి సాధించి మినీమహానాడులు  నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కావలిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి
ప్రతాప్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మేకపాటి
రాజమోహన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలను నియమించి అభివృద్ధి
సాధించామంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జలదీక్ష చేస్తే టీడీపీ నేతలు విమర్శించడం శోచనీయమన్నారు.
రైతుల పక్షాన మా అధినేత ఎప్పుడూ పోరాడుతూ ఉంటారన్నారు.  నెల్లూరు ఎంపీ రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రజల
కోసం పోరాడుతామన్నారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన
ఎవరైనా వైఎస్సార్‌సీపీని వీడుతారని అనుకోర న్నారు.  పార్టీ
ఫిరాయించిన వారికి అవమానాలు తప్ప, ప్రయోజనాలు
ఏమీ ఉండవన్నారు. ప్రజలు వీరి చేష్టలపై ఆగ్రహంతో ఉన్నారని 2019లో తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ అవతరించి అధికారంలోకి
వస్తుందన్నారు.  

  ఈ సమావేశంలో ఇతర
నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top