అమెరికాలో వైఎస్సార్ ఫౌండేషన్ ఫుడ్ డ్రైవ్


హైదరాబాద్: డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ (యూఎస్‌ఏ) ఆధ్వర్యంలో అమెరికాలని 9 నగరాల్లో వారంరోజుల పాటు ఫుడ్ డ్రైవ్ నిర్వహించారు. దాదాపు 10 వేల మంది నిరుపేదలకు గత నెల 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. ఇందుకోసం ఫుడ్‌బ్యాంకులు, క్రిస్టియన్ మిషనరీలు ఆహార పదార్థాలు సమకూర్చాయని ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి తెలిపారు. డాక్టర్ ప్రేమసాగర్ పర్యవేక్షణలో ఏటా డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు.Back to Top