మీ కుటుంబంలో ఇలా జరిగితే ఊరుకుంటారా..?

దళిత మహిళలను అడ్డుపెట్టుకొని కుట్ర రాజకీయాలు
మహిళల మాన ప్రాణాలతో ఆటలు
సెక్స్ రాకెట్ పై చర్చకు బాబు అడ్డంకులు
నిందితులను కాపాడేందుకు తాపత్రయం
కుటుంబాలకు కుటుంబాలు కూలిపోతుంటే పట్టదా..?
మాటలు కాదు బాబు చేతల్లో చూపుః ఉప్పులేటి కల్పన

హైదరాబాద్ః
దళిత మహిళల్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వం
వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా
జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని పక్కదారి పట్టించాలన్న
ఉద్దేశ్యంతో ...చంద్రబాబు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు వాడుకోవడం
సిగ్గుచేటన్నారు. సెక్స్ రాకెట్ కుంభకోణంలో వాళ్ల రహస్యాలు బయటపడతాయనే
చంద్రబాబు అంబేద్కర్ ను అడ్డుపెట్టుకొని చర్చను అడ్డుకున్నారని నిప్పులు
చెరిగారు. వేలమంది మహిళల మాన ప్రాణాలు దోచుకున్న దోషులను రక్షించడం
కోసమే... చంద్రబాబు బీఏసీలో పెట్టని అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయాలు
చేశాడన్నారు.   

కాల్ మనీ సెక్స్
రాకట్ వ్యవహారం చిన్న ఇష్యూ అంటూ అధికారపక్షం సభ్యులు మాట్లాడడం
బాధాకరమన్నారు. కాల్ మనీని వడ్డీ వ్యాపారం లాగా చూస్తూ దాని ముసుగులో
జరుగుతున్న సెక్స్ రాకెట్  విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని
మండిపడ్డారు.  కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని
కల్పన ఫైరయ్యారు.  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్న
చంద్రబాబు..సెక్స్ రాకెట్ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు దళిత
మహిళలు, అంబేద్కర్ పేరు అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని
 విరుచుకుపడ్డారు. 

రోజా తిట్టిందంటూ చంద్రబాబు
డైరక్షన్ లో సభలో దళిత మహిళలు  కన్నీళ్లు పెడుతున్నారు. ముఖ్యమంత్రిని,
టీడీపీ నాయకుల్ని ఒక్కటే అడుగుతున్నా... రోజా ఎలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు
చేయకుండానే కన్నీళ్లు పెడుతున్నారు. కావాలని రాద్దాంతం చేస్తున్నారు. మరి
సెక్స్ రాకెట్ లో వేలమంది మహిళల జీవితాలతో  ఆడుకుంటే ..ఆవిషయాన్ని ఎందుకు
పక్కనబెడుతున్నారు...? ఎందుకు విచారించడం లేదు..? దోషులను అరెస్ట్ చేసి
వారిపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఉప్పులేటి కల్పన ప్రభుత్వాన్ని
నిలదీశారు. 

కుటుంబాలకు కుటుంబాలు కూలిపోతున్నా
చంద్రబాబు కంటికి కనబడడం లేదా..? మహిళలు శారీరకంగా, మానసికంగా హింసకు గురై
ఏడుస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతుందని
నమ్ముతున్నాం కాబట్టే కాల్ మనీ సీఎం అని అన్నందుకు రోజాను సస్పెండ్ చేశారు.
ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నాం. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై కోర్టుకు
వెళతాం. పక్షపాత వైఖరి అవలంభిస్తున్న స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం
పెడతామని కల్పన స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని బయటకు పంపించి  బిల్లుల్ని
పాసుచేసుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని కల్పన ఆగ్రహం వ్యక్తం
చేశారు. 

టాస్క్ ఫోర్స్... సెక్స్ రాకెట్ ముఠాపై
దాడి చేసి డాక్యుమెంట్లు, చెక్కులు, ప్రాంసరీ నోట్లు, 200 సీడీలు దొరికాయని
చెప్పిందని, రెండు మూడు రోజుల్లో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు
తేలుస్తామందని ఉప్పులేటి కల్పన అన్నారు. దోషుల్ని శిక్షిస్తామని చెప్పిన
మీరు వారిని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని కల్పన చంద్రబాబును డిమాండ్
చేశారు. వడ్డీలు కట్టలేని పరిస్థితుల్లో మహిళల్ని చెరపట్టి వ్యభిచార
రొంపిలోకి దింపారు. చదువుకునే టీనేజ్ అమ్మాయిలను కూడా సెక్స్ రాకెట్ లోకి
బలవంతంగా లాగారు. వీడియోలు తీసి బయటపెడతామని బెదిరించి వారి  ఆస్తులు
రాసుకోవడమే గాకుండా  శారీరకంగా, మానసికంగా క్షోభ పెడితే...  చంద్రబాబుకు
కనబడడం లేదా అని ఉప్పులేటి కల్పన సూటిగా ప్రశ్నించారు.  చంద్రబాబు మీ
కుటుంబంలోని మహిళలకు ఈరకంగా అన్యాయం జరిగితే ఊరుకుంటారా అని నిలదీశారు. 

మహిళా
శానసభ్యురాలు కామ అన్నందుకు రాద్దాంతం చేసి నిబంధనలకు విరుద్ధంగా
 సంవత్సరం సస్పెండ్ చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ రూల్స్ చదివి
వినిపించినా పట్టించుకోలేదు. నియమాలను తుంగలో తొక్కుతూ లేని అధికారాలు
 తీసుకొని మహిళా శానససభ్యురాలిని సస్పెండ్ చేశారు.  దళిత
మహిళల్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు సభలో మాట్లాడిస్తున్నారని ప్రజలంతా
గుర్తించారని ఉప్పులేటి కల్పన తెలిపారు. మూడు రోజులు అయిన తర్వాత సభలో
వాళ్ల చేత మాట్లాడిస్తున్న చంద్రబాబు... కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని
సభలోకి ఎందుకు రానీయలేదని ఐదు కోట్ల మంది ప్రజలు చంద్రబాబును
అడుగుతున్నారని చెప్పారు. 
Back to Top