మంత్రి కొడుకు త‌ప్పు చేసినా అదే వంక చెబుతారామ‌హిళ‌ల ప‌ట్ల చంద్ర‌బాబు వైఖ‌రి కి అనుగుణంగానే తెలుగుదేశం నాయ‌కులు చెల‌రేగిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని వైఎస్సార్సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ ఉప్పులేటి క‌ల్ప‌న అభిప్రాయ ప‌డ్డారు. హైద‌రాబాద్ లోని పార్టీ కేంద కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 
ఒక వైపు మంత్రి కొడుకు న‌డిరోడ్డుపై ఒక అమ్మాయి చేయి పట్టుకొని లాగి అవ‌మాన‌ప‌రుస్తారు.... మ‌రోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు అమ్మాయిల వెంట ప‌డండి... క‌డుపులు చేసేయండి అని గీతోప‌దేశం చేస్తారు  అని కల్ప‌న త‌ప్పు ప‌ట్టారు.  య‌థా రాజా.. త‌థా ప్ర‌జ అన్న విధంగా.... రాజు ఎలా ఉంటే ప్ర‌జ‌లు అలా ఉంటారు అన్న విధంగా చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌ను వేధించ‌టాన్నే టీడీపీ నేత‌లు ఆద‌ర్శం గా తీసుకొన్నార‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. కాల్‌మ‌నీ - సెక్స్‌రాకెట్‌, ఆశ‌వ‌ర్క‌ర్ల ఉద్యోగాలు తొల‌గించ‌డం, అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌పై లాఠీచార్జి చేయ‌డంతో టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు సైతం అదేబాటలో ప్రయాణిస్తున్నార‌న్నారు.  బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు ప‌ల‌క‌లేని విధంగా ఉండ‌డంతో మ‌హిళ‌లంతా ఆగ్ర‌హంతో అట్టుడికిపోతున్నార‌ని ఉప్పులేటి క‌ల్ప‌న అన్నారు. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి ఒక ఎమ్మెల్యే మాట్లాడే మాట‌లేనా అని ప్ర‌శ్నించారు. 

 రాష్ట్రంలోని మ‌హిళలంద‌రిపైన టీడీపీ ఎంతో వివ‌క్ష‌తో ఉందని అన్నారు.  డ్వాక్రామ‌హిళ‌ల‌ను పావులుగా వాడుకొని రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంతో మ‌హిళ‌లు అప్పులు తీర్చ‌లేక ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు.  ఆశ‌వ‌ర్క‌ర్ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం, అంగ‌న్‌వాడీల‌పై లాఠీచార్జీ చేయ‌డం, ప‌శువుల‌ను కొట్టిన‌ట్లు కొట్ట‌డం, ఉద్య‌మం చేసిన మ‌హిళ‌ల‌ను ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం, వారిపై క‌క్ష‌ సాధింపు చ‌ర్య‌ల‌కు పునుకోవ‌డం ఎంత దుర్మార్గ‌మైన సంఘ‌ట‌న అని పేర్కొన్నారు. రిషితేశ్వ‌రీ మీద అగ్ర‌కులానికి చెందిన ప్రిన్సిపాల్ బాబురావు  ఏవిధంగా వేధింపుల‌కు గురి చేశాడో అంద‌రికి తెలిసిందేన‌ని, దానికి ఆ అమ్మాయి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డితే, ఆ కేసును నీరుగార్చార‌ని ఆమె మండిప‌డ్డారు.  ఏలూరులో హిందుమ‌తి అనే అమ్మాయి ని కొంద‌రు ప్రేమోన్మాదులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విధంగా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై ఇన్ని ఆరాచ‌కాలు జరుగుతున్నా ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారిస్తుంద‌ని ఆరోపించారు. 

అవినీతి సొమ్ములు కూడ‌క‌ట్టుకోవ‌డం, ఆ సొమ్ముతో ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌డం చంద్ర‌బాబుకు వెన్న‌తో పెట్టిన విద్య‌గా అభివ‌ర్ణించారు. మ‌నం  ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా?   లేక ఏదైన చంబ‌ల్‌లోయ‌లో ఉన్నామా అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. పోలీస్ వ్య‌వ‌స్థ పూర్తిగా అధికార పార్టీకి వంత‌పాడుతున్నారే త‌ప్పా ఎవ‌రైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేయ‌డం లేద‌ని తెలిపారు. రాష్ట్రం న‌డిబొడ్డున కాల్‌మ‌నీ - సెక్స్‌రాకెట్‌లో టీడీపీలోని అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు వెలుగుచూసినా చంద్ర‌బాబుకు చీమ  కుట్టిన‌ట్లు కూడా లేద‌న్నారు.  కాల్‌మ‌నీపై అసెంబ్లీలో నిల‌దీసిన పాపానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాను అన్యాయంగా స‌స్పెండ్ చేయ‌డం, బాక్సైట్ వ్య‌వ‌హారంలో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డిఈశ్వ‌రిపై రాజద్రోహం కేసు పెట్ట‌డం,  ఇసుక దందాను అడ్డుకున్న ఎంఆర్ఓ వ‌న‌జాక్షిపై ఎమ్మెల్యే చింత‌మ‌నేని దాడికి పాల్ప‌డ‌డం చంద్ర‌బాబు పాల‌న తీరుకు అద్దం ప‌డుతున్నాయ‌న్నారు.  రాష్ట్రంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న‌ అన్యాయాల‌పై చంద్ర‌బాబు ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారా..? అని ప్ర‌శ్నించారు. 

కాపుల ఉద్య‌మంలో రైలుకు ఎవ‌రో నిప్పంటిస్తే దాని వెన‌క జ‌గ‌న్ అంటారు... ముద్ర‌గ‌డ ఉద్య‌మం వెన‌క జ‌గ‌న్ గారు ఉన్నారంటారు. ఎక్క‌డ  ఏమి జ‌రిగినా దాని వెన‌క జ‌గ‌న్ గారి హ‌స్తం ఉంద‌ని అంటున్నార‌ని ఉప్పులేటి క‌ల్ప‌న వ్యాఖ్యానించారు.  ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడిగా ఆయ‌న్ను ఎదుర్కొలేకే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు.  రావెల కిశోర్ బాబు త‌న‌యుడుని  వెన‌కేసుకురావడానికి కొన్ని హ‌ద్దులుండాలి. మంత్రులు, ఎమ్మెల్యేల పిల్ల‌లు ఎవ‌రైనా చ‌ట్టానికి ఒక‌టే అన్నారు. ఉరుమురిమి మంగ‌ళం మీద ప‌డ్డ‌ట్టు..  బోండా ఉమ కుమారుడికి... రావెల త‌న‌యుడికి ఇలా అంద‌రికి కుక్క‌పిల్ల ఒక ఆయుధంలా మారింద‌ని ఆమె ఎద్దేవా చేశారు.  
Back to Top