ఉపఎన్నికలు నివారించే కుట్ర: అమర్నాథ్, ప్రవీణ్

హైదరాబాద్, 13 మే 2013:

స్పీకరు దగ్గర విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిన అవసరం లేదని టిడిపి  తిరుగుబాటు ఎమ్మెల్యేలు అమర్నాథ్‌ రెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే తమను అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలు నిర్వహించాలని శాసన సభాపతికి ఒక లేఖను ఫ్యాక్సు చేశామని చెప్పారు. ఉప ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలో తమను బలి పశువులు చేయద్దన్నారు. ఈ కుట్రలో శాసన సభాపతి భాగస్వామి కాకూడదనే తాము కోరుకుంటున్నామని చెప్పారు. తక్షణమే ఎన్నికలు వచ్చేలా తమను అనర్హులుగా ప్రకటించాలనీ, తమ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయవద్దనీ వారు విజ్ఞప్తి చేశారు.

Back to Top