ఉప ఎన్నిక వాయిదా వేసేందుకు టీడీపీ కుట్ర

నంద్యాల: తెలుగు దేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నంద్యాల ఉప ఎన్నిక వాయిదా వేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనుమానం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాపుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడను నిర్భందించడానికి 6 వేల మంది పోలీసులను నియమించిన చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో ఎందుకు పోలీసు బలగాలను దించడం లేదని నిలదీశారు. ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా వైయసార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కాపులు, బలిజలు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు తెలపడంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాపులు, బలిజలు ఒక్కటి కాదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఉమ్మారెడ్డి సూచించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నంద్యాలలో ఆరు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించాలని సవాల్‌ విసిరారు. 

Back to Top