మరిచిపోలేని స్మ్రతులు

దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిని తలచుకొంటే రెండు విషయాలు కళ్ల ముందు మెదలుతాయి.

2003 లో అనుకుంటాను .. మా ఇంట్లో కరెంట్ మీటర్ చెడి పోయింది. పదిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిన తరువాత లైన్ మాన్ కరుణించి ఇంటికి వఛి మీటర్ మార్చాలి అని చెప్పాడు. "సరే మార్చండి" అన్నాను. మూడు వేలు అవుతుంది అన్నాడు అతను. నా గుండె గుభిల్లు మన్నది. దేనికి అని అడిగాను. మీటర్ కు ఆరు వందలు, కావలసిన వైర్లు కొనడానికి ఐదు వందలు, మిగిలింది తనకు అని మొహమాటం లేకుండా చెప్పాడు. ఎంతసేపు బేరం చేసినా నయాపైసా కూడా తగ్గలేదు.

చేసేది లేక అతనికి మూడువేల రూపాయలు సమర్పించి పని చేయించుకున్నాను.

2007 లో అనుకుంటాను. ఆ మీటర్ చెడిపోయింది. మళ్ళీ మూడు వేలు ఆముదం తప్పదు అని భయపడ్డాను. ఆ మరునాడు మీటర్ రీడింగ్ తీసుకునే ఉద్యోగి వఛాడు. అతనికి చెప్పాను. అతను మీటర్ చెక్ చేసి "దీన్ని మార్చాలి. ఒక గంట లో వస్తానని" చెప్పి వెళ్ళిపోయాడు.

గంట తరువాత లైన్మాన్ తో కొత్త మీటర్ తీసుకుని వఛాడు. కొత్త మీటర్ ను బిగించి పాతది తీసుకుని వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం!!! ఒక్క పైసా అడగలేదు అతను. ఆ మీటర్ ఇప్పటికీ నడుస్తున్నది.

@@@@

ఏడెనిమిది ఏళ్ళ క్రితం మాకు తెలిసిన ఒక పేద బ్రాహ్మణ కుటుంబం లోని ఇద్దరు పిల్లలు ఇంజినీరింగ్ కోర్సులు చదివారు. రెండు ఏళ్ళక్రితం వారు కనిపించినప్పుడు "బాంక్ లోన్ తీసుకున్నారా ఫీజుల కోసం?" అని అడిగాను. "లేదు వైయస్ఆర్ పెట్టిన ఫీజు reimbursement scheme ద్వారా చదువుకున్నాం. ఒక్క పైసా కూడా మాకు ఖర్చు కాలేదు" అని చెప్పారు వాళ్ళు!!

నాకు ఆశ్చర్యం కలిగింది. కొన్ని కులాల వారికి మాత్రమే ఆ పధకం అనే అభిప్రాయము నాకు ఉండేది. కానీ దాన్ని కులమత భేదాలు లేకుండా అగ్ర వర్ణాల పేదలకు కూడా ఆ పధకాన్ని వర్తింప చేసారు వైయస్ఆర్ అని అప్పుడు నాకు తెలిసింది.

ఆ పిల్లలు ఇద్దరూ ఇప్పుడు MNC లలో పనిచేస్తూ లక్షలు సంపాదిస్తూ దర్జాగా జీవిస్తున్నారు.

వైయస్ఆర్ పాలన ఎంత ప్రజారంజకం గా సాగింది అని చెప్పడానికి పైన చెప్పిన రెండు ఉదాహరణలు చాలు. ప్రేమ, దయ, మానవత్వం మూర్తీభవించిన స్వర్ణమయ పాలన ఆ అయిదు ఏళ్ళు.

చంద్రబాబు కాకులను కొట్టి గద్దలకు పెట్టాడు. వైయస్ఆర్ గద్దలను కొట్టి కాకులకు పెట్టాడు. పేదలకు లాభం కలుగుతుంది అనిపిస్తే ఎంత ఖర్చు అయినా ఆ పధకాన్ని అమలు చేశాడు. అందుకే ఆయన పేదల హృదయకోవెలలో శాస్వతముగా నిలిచిపోయాడు. ఇవాళ్టి క్రూర పాలకులు ఆయన విగ్రహాలు ధ్వంసం చెయ్యవఛు. కానీ ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దేవుడిని ఎలా పీకేయ్యగలరు?

కులగజ్జి తో రగిలి పోయే మన మీడియా అవినీతి పరుల కు భజనలు చెయ్యొచ్చు. కానీ వైయస్ఆర్ కు ప్రజల సదా సంకీర్తనలు చేస్తూనే ఉంటారు.

మహాకవి అన్న విశేషణం ఒక్క శ్రీశ్రీ కె సరిపోతుంది.
మహానేత అన్న విశేషణం ఒక్క వైయస్ఆర్ కు మాత్రమే సరిపోతుంది.

ఆయన వర్ధంతి సందర్భం గా నా ఘన నివాళులు.

Back to Top