కుండపోత వర్షాలతో భారీ ప్రాణ,ఆస్తినష్టం..వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఏపీలో కుండపోత వర్షాలు, పిడుగులు  బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఒక్కరోజే పిడుగులు పడి 20 మంది మృతిచెందారు. వర్షాలతో గోడ కూలి మరొకరు చనిపోయారు. పలుచోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. కృష్ణా, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ ప్రాణ,ఆస్తి నష్టం సంభవించింది. 

పిడుగుపాటుకు ప్రకాశం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో ఆరుగురు(వీరిలో గోడకూలి ఒకరు)మృతి చెందగా...కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మరణించారు. ఆస్తి,ప్రాణనష్టంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  
Back to Top