జ‌గ‌న్ కు నిరుద్యోగుల విన‌తి


హైద‌రాబాద్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిరుద్యోగుల సంఘం స‌భ్యులు శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయ‌ని ఆ సంఘం నేత‌లు ఆయ‌న దృష్టికి తీసుకొని వ‌చ్చారు. చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చి 15 నెల‌లు గ‌డుస్తున్నా, ఒక్క ప్ర‌భుత్వ ఉద్యోగం కూడాభ‌ర్తీ చేయ‌లేద‌ని వివ‌రించారు. అసెంబ్లీ సమావేశాల లోపు నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. లేదంటే అసెంబ్లీ ని ముట్ట‌డిస్తామ‌ని వారు అన్నారు.

Back to Top