వైయస్‌ఆర్‌ సీపీ ఉద్యమానికి ఉండవల్లి మద్దతు

రాజమండ్రి: ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఉద్యమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మద్దతు తెలిపారు. ఢిల్లీలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు నిరసనగా కొటగుమ్మంలో సెంటర్‌ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఉండవల్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ హోదా ఉద్యమం సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానన్నారు. ఎంపీల రాజీనామాలతో హోదా వేడి ఎన్నికల వరకు కొనసాగుతుందన్నారు. కేంద్రంలో రాబోయే సర్కార్‌పై హోదా ఇవ్వాలన్న ఒత్తిడి ఉంటుందన్నారు.  
Back to Top