బాబు పాలనలో అంటరానితనం

– దళిత తేజం– తెలుగు దేశం అంటే ఇదేనా..?
– దళితులపై దాడులు, హత్యలు పెరిగాయి
– గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తాం
– దళితులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది
– ఎస్సీ విభాగం  అధ్యక్షుడు మేరుగ నాగార్జున 

విజయవాడ : ప్రజా సమస్యలపై ప్రతిపక్షం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం  జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దళిత మహిళలపై  అఘాయిత్యాలు, దళిత నాయకుల హత్యలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ దళితులంటే అంటరానితనం, అస్పృశ్యత కొనసాగడం దారుణమన్నారు. ఆయనింకా ఏమన్నారంటే... వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడిగితే తప్ప సీఎంకు గుర్తురాదు. జననేత ప్రజల్లోకి వెళితే వాళ్లకు నిద్ర పట్టదు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోందని ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబులో చలనం లేదు. దళిత సంక్షేమం వెక్కిరిస్తోంది. దళిత సంక్షేమం మూగబోయింది. స్వయాన చంద్రబాబే దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చెప్పిన మాటలను జనం మర్చి పోలేదు.  బాబు కేబినెట్‌ మంత్రి దళితుల పట్ల అవహేళనగా మాట్లాడినా చర్యలుండవు. దళితులు మురికిగా ఉంటారని మాట్లాడినా ఆయన్ను మందలించింది లేదు. దళితుల భూములు టీడీపీ నాయకులు లాక్కుంటున్నా చర్యలు తీసుకోలేదు. గరగప్రరులో దళితులను వెలివేసినా, దేవరాపల్లిలో దళితుల భూములు లాక్కున్నా, అనకాలపల్లిలో దళితుడి మీద దాడిచేసినా, విశాఖ జిల్లా జెర్రిపోతుల పాలెంలో దళిత మహిళను వివస్త్రను చేసినా, కర్నూలు జిల్లాలో వసంతరావును చంపినా, తాడిపత్రిలో 9 మందిని దారుణంగా చంపినా, నెల్లూరు జిల్లాలో దళితుల భుములు లాక్కున్నా, గుంటూరు జిల్లాలో రవి అనే ఉద్యోగి ఆత్మహత్యకు ప్రభుత్వ పెద్దలే కారణమని చెప్పినా చర్యలు తీసుకోలేదు. ఇన్ని అన్యాయాలు జరిగినా మాట్లాడని చంద్రబాబు.. దళిత తేజం అని పోస్టర్లు వేసి డ్రామాలు ఆడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి సరేసరి. ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను నీరు గార్చిన చరిత్ర చంద్రబాబుది. దళిత తేజం– తెలుగు దేశం ఒట్టి డ్రామాలే. నిన్న కడప జిల్లాలో జరిగిన మీటింగ్‌లో దళితులను కింద కుర్చోటెట్టి అగ్రవర్ణాలు కుర్చీల్లో కుర్చోవడమేనా దళిత తేజం. అసమానతలకు ఏం సమాధానం చెబుతారు. ఇప్పటికీ అస్పృశ్యతా, అంటరాతనితనం కొనసాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇంత జరుగుతున్నా మంత్రులకు, ఎస్సీ ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. దీనికి సమాధానం చెప్పాలి. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే దళితులు పండించుకునే భూములకు వారినే యజమానులుగా చేస్తామని చెప్పి వైయస్‌ జగన్‌ దళిత పక్షపాతిగా నిలిచారు. కడపలో దళితులను కింద కూర్చోబెట్టిన సంఘటనపై చంద్రబాబు పార్టీ ఏం సమాధానం చెబుతుందో..  చంద్రబాబు కుయుక్తులు సాగనివ్వబోం.. ప్రతి దళిత గడపకు వెళ్లి చంద్రబాబు అసమానతలు, అంటరానితనాన్ని ప్రచారం చేస్తాం. వైయస్‌ఆర్‌సీపీ దళితులకు అండగా ఉంటుంది.
Back to Top