రాజీపడితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినట్లే

()ఓటుకు కోట్లు కేసు ఇష్యూని తప్పుదారి పట్టించడానికే పిటిషన్
()క్వాష్ పిటిషన్ వేయడమంటే బాబు తప్పు ఒప్పుకున్నట్లే
()ఆడియో టేపుల్లోని వాయిస్ తనదేనని బాబు నిర్థారించుకున్నారు
()రెండున్నరేళ్లుగా హోదాపై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపాటు

హైదరాబాద్ః ఓటుకు కోట్లు కేసులో చెప్పుకోవడానికి ఏమీ లేదని తేలిగ్గా తీసిపారేసిన చంద్రబాబు...హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. భయంతోనే చంద్రబాబు పిటిషన్ వేశారని  ఉమ్మారెడ్డి ఎద్దేవా చేశారు.  ఓటుకు కోట్లు కేసులో ఉన్నది తన వాయిసేనని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అన్నారు. గతంలో కూడా చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుకెళ్లి స్టేలు తెచ్చుకున్న పరిస్థితులున్నాయని, ఇప్పుడు కూడా అదే మాదిరి స్టే తెచ్చుకోవాలనుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దురదృష్టకర పరిణామని అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు.

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే...
()ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రికి ఏ ఇబ్బంది లేకపోతే, లంచ్ మోషన్ లో క్వాష్ పిటిషన్ ఫైల్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది
()సెప్టెంబర్ 29వరకు ఏసీబీ కోర్టులో విచారణ చేసే ప్రాసెస్ ను ఆపమని లంచ్ మోషన్ మూవ్ చేయడం దారుణం. ముఖ్యమంక్రి ఇబ్బంది లేకపోతే క్వాష్ పిటిషన్ వేయడం వెనుక చంద్రబాబు ఆడియో టేపుల్లోని వాయిస్ తనదేనని నిర్థారించుకున్నారు. 
()రేవంత్ ఇచ్చిన డబ్బుపై స్పష్టత లేకపోవడం, మత్తయ్య ఏపీలో షల్టర్ తీసుకోవడం, హైదరాబాద్ లో సెక్షన్ 8 ఎందుకు అమలు చేయడం లేదన్న ఉదంతం చూస్తే... తప్పు చేశానని చంద్రబాబు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లుగా ఉంది. 
()ముఖ్యమంత్రిపై 25 కేసులున్నా ఎలాంటి చర్యలు లేవు. 
()ఇంతకుముందు కూడా అనేక కేసుల్లో బాబు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న పరిస్థితులున్నాయి. ఈసారి కూడా మళ్లీ టెక్నికల్ సాకుతో క్వాష్  పిటిషన్ వేసి స్టే తెచ్చుకోవాలని అనుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దురదృష్టకర పరిణామం. 
()రాజధాని భూముల్లో అవినీతి జరుగుతోందంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ కావాలనే ప్రతిపక్షంపై దాడి చేశారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. 
()ఓటుకు కోట్లు కేసు ఇష్యూని తప్పుదారి పట్టించడానికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు తప్ప మరొకటి కాదు.
()మాకయితే పూర్తి నమ్మకముంది. హైకోర్టు క్వాష్ పిటిషన్ పై తీసుకున్న నిర్ణయం న్యాయబద్ధంగానే ఉంటాయనుకుంటున్నాం
()అమిత్ షా, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడుల దగ్గర సుజనాచౌదరి ఏం చర్చించారో, హైదరాబాద్ వచ్చి గవర్నర్ ను ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. 
()ప్రత్యేకహోదా విషయంలో మీడియాకు లీకులిస్తూ మభ్యపెడుతున్నారు. పొంతన లేని స్టేట్ మెంట్ లు వస్తున్నాయి. హోదాను కేంద్రం ఇవ్వాలనుకుంటుంది. ముఖ్యమంత్రి అభిప్రాయాలు చెబుతున్నారని, ఇంకా కొన్ని పత్రికల్లో ఏకంగా అల్టిమేటం ఇచ్చారు. కుదరకపోతే విడిపోతామన్నారని రాసి ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. 
() రాష్ట్రానికి ప్రత్యేకహోదా అత్యవసరమైంది. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రాష్ట్రం ఆర్థికంగా స్థిరపడాలన్నా ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రెండు అవసరమే. అంతేకాదు విభజన చట్టంలోని హామీలన్నంటిని నెరవేర్చాలి. 
()టీడీపీ, బీజేపీలు హోదా ఇవ్వకుండా కుంటిసాకులు చెప్పడం తగదు.  ప్రత్యేకహోదా అన్నది తెలుగుదేశం, బీజేపీ ల మధ్య సమస్య కాదు రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయం. 
()ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి గానీ, మభ్యపెట్టేవిధంగా మీడియాకు లీకులివ్వడం దారుణం. జరుగుతున్న విషయాలు ప్రజల ముందుకు  తీసుకురాకపోవడం సరైంది కాదు 
()రెండున్నరేళ్లుగా డ్రామాలు నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బలహీనత ఏమిటి. ఎందుకు చెప్పలేకపోతుంది. అమిత్ షా దగ్గర  ఏం చర్చలు జరిగాయి. జైట్లీ, వెంకయ్య, సుజనా వీళ్లంతా ఏం చర్చించారో, గవర్నర్ తో ఏం మాట్లాడారో బయటపెట్టాలి
()ప్రజలను మభ్యపెట్టొద్దు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందే. 11 రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలన్నీ ఇవ్వాలి. 13వ షెడ్యూల్లోని  హామీలన్నీ అమలు 
చేయాలి. పోలవరం కేంద్రమే నిర్మిస్తామని చెప్పింది. అరకొరకగా నిధులు కేటాయించడం  గాకుండా పూర్తిగా అమలు చేయాలి. 
()చంద్రబాబు ఏం అంశంలో రాజీ పడినా ఆరుకోట్ల మంది ప్రజానీకాన్ని అన్యాయం చేసినవారవుతారు. జరుగుతున్న పరిణామాల్ని ప్రజానీకానికి చెప్పాలి. 
()ప్యాకేజీ హోదాకు ప్రత్యామ్నాయం కాదు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెప్పాలి
Back to Top