నిరుద్యోగుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొని గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రెండేళ్లవుతున్నా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోవడం లేదని నిరుద్యోగులు మండిపడ్డారు. 


Back to Top