ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి

1.70 కోట్ల సంఖ్యను 10 లక్షలకు తగ్గించి వంచన

రూ.2 వేలకు హామీ ఇచ్చి వెయ్యి మాత్రమే అంటూ దగా

చంద్రబాబు తీరుపై మండిపడ్డ ప్రతిపక్ష నేత

అధికారంలోకి వస్తే కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య


పాలకొల్లు: ఎన్నికలు దగ్గర పడటంతోనే చంద్రబాబు నాయుడు
నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకున్నారని, ఇది మరోసారి ప్రజలను వంచిండానికి
ఉద్దేశించినదే తప్ప, నిజంగా యువతకు మేలు చేసేది కాదని ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శుక్రవారం
నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టారు.
రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉండగా, ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామని
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, విస్తృతంగా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన
నాలుగేళ్ల తరువాత ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించి, ఇస్తామన్న రెండువేలకు బదులుగా
వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించారన్నారు. ఈ భృతి చెల్లింపు వాస్తవ రూపం
దాల్చే సమయానికి ఈ సంఖ్య 10 లక్షల కంటే తగ్గినా ఆశ్చర్యం లేదని ఎద్దెవా చేశారు. ఈ
మొత్తం కుడా కేవలం ఆరు నెలలు మాత్రమే చెప్పడం కంటే దారుణమైన మోసం మరోకటి ఉంటుందా
అని ప్రశ్నించారు.

వాణిజ్యానికి ప్రసిద్ధి పొందిన  పాలకొల్లులో
వ్యవసాయం పండగ అన్నది పోయి, దండగ అన్నట్లుగా మారిపోయిందని జననేత అన్నారు. డెల్టా
ప్రాంతానికి నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని, నానా అగ చాట్లు పడి పండించిన
పంటలకు గిట్టుబాటు, మద్ధతు ధరలు రావడం లేదనీ, ఉపాథి కోసం యువత వలసల బాట
పడుతున్నారని, ఆక్వా రంగం కుదులైందని అన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ
గెలిపించిన రుణాన్ని ఇంతటి దారుణమైన పాలనతో
 తీర్చుకుంటున్నారంటూ మండిపడ్డారు. ప్రధానంగా ఈ జిలాలో టిడిపి నాయకుల దోపిడీ యధేచ్చగా
సాగుతోందని, చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలకు దోపిడీ ఎలా చేయాలో అన్న దానిపై
ట్రైనింగ్ ఇచ్చి వదిలేశారని ఆరోపించారు. దీంతో వారు మట్టి,ఇసుకు, మద్యం దేన్నీ
వదిలిపెట్టకుండా అవినీతి అక్రమాలకు తెగబడ్డారన్నారు. గోదావరి పుష్కరాలు
దైవకార్యంగా నిర్వహించాల్సిన పుష్కరాల కోసం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో దాదాపు
350 కోట్ల విలువైన పనులు చేయగా, అవన్నీ ధ్వంసం అయిపోయాయంటే ఎంతటి అవినీతి జరిగిందో
అర్ధం అవుతుందన్నారు.

ఈ సభ జరుగుతున్న గాంధీ బొమ్మ సెంటర్ లోనే ఇసుక
లారీలను నిలబెట్టి విక్రయాలు జరుపుతున్నా, జిల్లా కలెక్టరు, ఇతర  అధికారులు, ఎమ్మెల్యేలు చోద్యం చూస్తున్నారు
తప్పితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వనం మనం పేరుతో టిడిపి
నాయకులు ధనయజ్ఞం చేస్తున్నారని ఒక్కో మొక్కకు వెయ్యి రూపాయల చొప్పున
స్థానికవ్యాపారస్తుల నుంచి వసూలు  చేసి,
వాటిని కొన్నట్ల్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు పొందారని ఇక్కడి అవినీతిని
ఎండగట్టారు. ఇక్కడి అధికారులు ఎమ్మెల్యేలకు వాటా పంపకపోతే , వారి నుంచి చీవాట్లు
తినాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

మహానేత వైయస్ ఆర్ మరణం తరువాత డెల్టా ఆధునీకరణ
పనులు దాదాపుగా నిలిచిపోయాయని, ఎక్కడైనా జరుతున్నా కమీషన్ల కోసమే నత్తనడకన
కొనసాగిస్తున్నారు తప్పితే పనులు పూర్తి చేయాలన్న సంకల్పం లేదని విమర్శించారు.
రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులున్నా, స్థానికులు ప్రతి నెలా 600,700 రూపాయలు
ఖర్చు పెట్టి మంచినీటిని కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులున్నా ప్రభుత్వంలో
చలనం లేదన్నారు.

పేదలకు కట్టించే ఇళ్ల విషయంలోనూ కమీషన్ల కోసం
కక్కుర్తి పడుతున్న వైనాన్ని ఈ సందర్భంగా వైయస్ జగన్ ప్రజలకు  వివరించారు.

ఈ సందర్భంగా తాము అధికారంలోకి వస్తే యువతకు ఉపాథి
కల్పించేందుకు, తీసుకోబోయే చర్యలను వివరిస్తూ, రాష్ట్రంలో అక్షరాస్యతా శాతాన్ని
పెంచేందుకు కేజీ నుంచి పిజీ వరకు ఉచిత విద్యను అమలు చేస్తామనీ పిల్లలను బడికి పంపే
కుటుంబాలకు ఏటా 15వేలు అందే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Back to Top