గోడ మీది పిల్లిలా సిఎం కిరణ్‌కుమార్‌ తీరు

గుంటూరు, 9 ఆగస్టు 2013 :

రాష్ట్ర విభజనకు అనుకూలమని గానీ, వ్యతిరేకమని గానీ స్పష్టంగా చెప్పకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గోడమీద పిల్లిలా వ్యవహరించారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎం.పి. ప్రొఫెసర్ ఉమ్మారెడ్డి‌ వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అంతర్గత తగాదాలతో రాష్ట్రంలో చిచ్చు రగిల్చారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనపై కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి సుదీర్ఘ వివరణ ఇవ్వడాన్ని ఉమ్మరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా సిఎం తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top