వైయస్‌ జగన్‌ సేవలు రాష్ట్రానికి..దేశానికి అవసరంహైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సేవలు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి, దేశానికి అవసరమని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు దేశ, విదేశాల్లో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగలా జరుపుకుంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని అందరూ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. 41 రోజులుగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతుందన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం గొప్పవిషయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ శ్రమిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగం కుదేలు అయిందని, రైతులకు అండగా వైయస్‌ జగన్‌ ఉంటారన్నారు. వైయస్‌ జగన్‌ అయురారోగ్యంగా ఉండాలని ఉమ్మారెడ్డి ప్రార్థించారు.
 
Back to Top