పొగాకు రైతుల త‌ర‌పున పోరాటం

హైద‌రాబాద్‌) పొగాకు రైతుల‌కు వైఎస్సార్
సీపీ అండ‌గా నిలుస్తోంది.
పొగాకు కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాని
ఎంత మొత్తుకొంటున్నా  ఈప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం
లేదు. గ‌త ఏడాది
కిలోకి రూ. 170 పైగా ధ‌ర
ప‌లుక‌గా, ఈ
ఏడాది మాత్రం రూ. 110 ద‌గ్గ‌రే
నిలిచిపోయింది. క‌నీసం రూ.
150 ధ‌ర ఇప్పించాల‌ని
పార్టీ సీనియ‌ర్ నేత‌,
ఎమ్మెల్సీ డాక్ట‌ర్ ఉమ్మారెడ్డి
వెంక‌టేశ్వ‌ర్లు డిమాండ్
చేశారు. దీనిపై ప్ర‌తిప‌క్ష
నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి
ఇచ్చిన గ‌డువు ముగిసింది.
దీంతో ఈ నెల 14న
అన్ని ప్లాట్ ఫామ్ ల ద‌గ్గ‌ర ఆందోళ‌న చేపట్టాల‌ని
నిర్ణ‌యించారు. అప్ప‌టికీ ప్ర‌భుత్వం దిగి రాక‌పోతే
గుంటూరులోని టుబాకో బోర్డును ముట్ట‌డించాల‌ని
పార్టీ వ‌ర్గాల‌కు
ఆయ‌న పిలుపు ఇచ్చారు.

Back to Top