వైఎస్ జగన్ కు ఓ రికార్డ్ ఉంది

విశాఖపట్నంః ఎన్నికల సమయంలో మద్యపానం నిషేధిస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను మోసగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. కల్తీమద్యంతో మరణాలు సంభవించి కుటుంబం పెద్ద దిక్కు కోల్పోతున్న నేపథ్యంలో మహిళలు ఎన్నోసార్లు ఉద్యమాలు జరిపారని..ఐనా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మద్యపానం వల్ల జరుగుతున్న అనర్థాలను దృష్టిలో పెట్టుకొని నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఓ రికార్డ్ ఉందని, ఆయన ఏదైనా మాట ఇచ్చారంటే అది తప్పకుండా అమలవుతుందనేది ప్రజల విశ్వాసమని ఉమ్మారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. మద్యపాన నిషేధం జరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారని ఉమ్మారెడ్డి ప్రకటించారు. మద్యం వల్లే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ప్రభుత్వం దురాలోచన చేస్తోందని దుయ్యబట్టారు. సామాన్య ప్రజలు అనారోగ్యం పాలవడం తప్ప దాని వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. 
Back to Top