ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏపీకి తీరని నష్టం

హైదరాబాద్ః కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ప్రాజెక్ట్ లతో ఏపీ ఎడారిగా మారే ప్రమాదముందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.  గత సంవత్సర కాలం నుంచి నీటి ప్రాజెక్ట్ లు, ఎత్తిపోతల పథకాలు కడుతున్నారని తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం  వాటిని నిలువరించలేకపోవడం దారుణమన్నారు. 

తెలంగాణలో నిర్మించబోయే ప్రాజెక్ట్ లకు బాబు అభ్యంతరాలు తెలపకపోవడం చాలా బాధకరమన్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఉమ్మారెడ్డి కోరారు. దీనిలో భాగంగానే నీటివనరుల తీవ్రతను, రాబోయే పెనుముప్పును తెలియజెప్పేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కర్నూలులో ఈనెల 16 నుంచి  మూడ్రోజుల పాటు జలదీక్ష చేపడుతున్నట్లు ఉమ్మారెడ్డి ప్రకటించారు. 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు తెలపాలని రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిచ్చారు. దీక్షను విజయవంతం చేయాలని కోరారు. 
To read this article in English:  http://bit.ly/1OkAp11 


Back to Top