మండలిలో బాక్సైట్ పై చర్చ

శాసనమండలిః  జీవో 97 తీసుకురావడం వెనక ఉద్దేశ్యమేంటో చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జీవోను తాత్కాలికంగా రద్దు చేసినట్లు కేబినెట్ లో చెప్పిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన  గుర్తు చేశారు.  భవిష్యత్తులో  బాక్సైట్ తవ్వకాలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతోనే ల్యాండ్ డైవర్షన్ చేస్తున్నారని ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల అంశం మీ  అజెండాలో ఉందా లేదా అన్న విషయం స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకుముందు కాల్ మనీ - సెక్స్ రాకెట్పై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా మండలి ఛైర్మన్ దాన్ని తిరస్కరించారు. 

బాక్సైట్ తవ్వకాలకు  గ్రామసభలో ఎటువంటి ఆమోదం లేదని ఉమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  19 నెలలయినా ఇంతవరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు . బాక్సైట్ గిరిజనుల జీవన విధానంపై ఆధారపడి ఉన్న అంశమని, ఇది  షెడ్యూల్ 5లో ఉన్నందున గవర్నర్ టేకప్ చేయాల్సి ఉంటుందన్నారు.  గతంలో కూడా చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని  గవర్నర్ కు లేఖ రాశారని చెప్పారు. బాక్సైట్ మైనింగ్ రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్లాల్సిన అంశమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండలిలో ప్రస్తావించారు.  

Back to Top