ఉగ్ర‌వాద దాడి పిరికిపంద‌ల చ‌ర్య‌

అనంత‌పురం : భార‌త్ - పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల దాడిని పిరికిపంద‌ల చ‌ర్య‌గా ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ అభివ‌ర్ణించారు. దీనా న‌గ‌ర్ లో పోలీసు స్టేష‌న్ లోకి చొర‌బ‌డి పోలీసులపై దాడి బాధాక‌రం అని ఆయ‌న అన్నారు. అనంత‌పురం జిల్లాలో రైతు భ‌రోసా యాత్ర లో ఉన్న వైఎస్ జ‌గ‌న్‌.. ఉగ్ర‌వాదుల దాడి ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకొని స్పందించారు. ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకూడ‌ద‌ని ఆయ‌న అన్నారు.

Back to Top