తెలుగువారికి ఉగాది శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌) తెలుగు సంప్ర‌దాయానికి ప్ర‌తీక‌, తెలుగు సంవత్స‌రంలో మొద‌టి పండుగ సంద‌ర్భంగా  తెలుగు వారందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాంప్ర‌దాయంలోని  60 సంవ‌త్స‌రాల కాల‌మాన చ‌క్రంలో 30వ సంవ‌త్స‌రమైన దుర్ముఖి నామ సంవత్స‌ర ప్రారంభ రోజు పుర‌స్క‌రించుకొని అభినంద‌న‌లు తెలిపారు.  తెలుగు సంవత్సర తొలి పండగ.. అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు నిండాల‌ని ఆయ‌న అభిల‌షించారు. ఏడాదంతా సకాలంలో వానలు పడి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని అన్నారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
Back to Top