ఉద్యమంలా సంతకాల సేకరణ

అనంతపురం:

ప్రజల మనిషి, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని విడుదల చేయాలని  కోరుతూ ఈ నెల 26య ప్రారంభించిన సంతకాల సేకరణ ఓ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి రోజూ జిల్లాలోని ఆయా నియోజకవర్గ నేతల ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల్లో సంతకాలను  సేకరిస్తున్నారు. నగరంలో రుద్రంపేట, శ్రీకంఠం సర్కిల్, శ్రీనివాసనగర్, అంబేద్కర్ సర్కిల్‌లో సంతకాల సేకరించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, పార్టీ జిల్లా  కన్వీనర్ శంకరనారాయణ, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత పాల్గొన్నారు. హిందూపురంలో మైనార్టీ సెల్ నాయకుడు రెహ్మాన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లలో సంతకాలు సేకరించారు. పెనుకొండలో పార్టీ నాయకుడు కదిరి బాషా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి మండలంలో బ్రాహ్మణపల్లె తండా, ఆమడగూరు మండలంలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లెలో పార్టీ మండల కన్వీనర్ మోడం కృష్ణారెడ్డి నేతృత్వంలో, కళ్యాణదుర్గంలో పట్టణ అధ్యక్షుడు దాదాఖలందర్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట, ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల కన్వీనర్ల సమక్షంలో సంతకాలు సేకరించారు.

Back to Top