ఉద్యమ వీరునికి తల్లి దీవెన..!

గుంటూరుః ప్రత్యేకహోదా సాధన కోసం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ కు మాతృమూర్తి వైఎస్ విజయమ్మ దీవెనలు అందించారు. నేటి ఉదయం గుంటూరు నల్లపాడు రోడ్డులోని వైఎస్ జగన్ దీక్షా స్థలికి వైఎస్ విజయమ్మ చేరుకున్నారు.  వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీక్ష విజయవతం కావాలని విజయమ్మ వైఎస్ జగన్ ను ఆశీర్వదించారు.  

రోజురోజుకు వైఎస్ జగన్ ఆరోగ్యం నీరసిస్తుండడంతో విజయమ్మ ఆందోళన చెందుతున్నారు.  జగన్ బాగా నీరసించారని, గంటగంటకు పల్స్ రేటు పడిపోతుందని వైద్యులు తెలిపడంతో విజయమ్మ కలవరపడుతున్నారు.  వైఎస్ జగన్ వెన్నంటే విజయమ్మ కూర్చొన్నారు.  ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. రాష్ట్ర ప్రజానీకమంతా వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు తండోపతండాలుగా నల్లపాడు రోడ్డుకు తరలివస్తున్నారు. ప్రత్యేకహోదా ఆకాంక్షను వ్యక్తపరుస్తూ వైఎస్ జగన్ కు  మద్దతు తెలుపుతున్నారు. 
Back to Top