దూర ప్రాంతాల నుండి వెల్లువెత్తుతున్న మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ తో గుంటూరులోని నల్లపాడులో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పట్టిన నిరవధిక నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపేందుకు UAE లోని YSRCP అభిమానులు అక్టోబర్ 8 న  సాయంత్రం 8:30 దుబాయ్ లోని సోనాపూర్ ప్రాంతంలో సమావేశం నిర్వహించారు. UAE లోని YSRCP అభిమానులు మరియు ప్రతినిధులు పాల్గొని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి సంఘీభావం తెలియజేశారు. దూరప్రాంతాల నుండి రాలేని వారు మరియు డ్యూటీ లో ఉన్నవారు, ఫోన్ మరియు ఇతర సామాజిక  మాధ్యమాల  ద్వారా వారి సంఘీభావం తెలియజేశారు. 

సమావేశంలో పలువురు అభిమానులు మాట్లాడి, ప్రత్యేక హోదా యొక్క ఉపయోగాలు వివరించారు. మరికొందరు మాట్లాడుతూ, ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక హోదాపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా వస్తే, వారు దుబాయ్ కి వలస రానవసరం లేకుండా, ఆంధ్రాలోనే ఉద్యోగ మరియు ఉపాది అవకాశాలు మెరుగుపడతాయని అబిప్రాయపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన  హామీలను అమలుపరచడంలో కేంద్ర ప్రభుత్వం మరియు  రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పలువురు దుయ్యబట్టారు. సోమి రెడ్డి,ఆనంద్ పడాల, GSN రెడ్డి మరియు జగదీష్, ఈ సమావేశ ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించారు.
Back to Top