ఛార్జీల పెంపును నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ :  విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంపునకు నిరసనగా తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టింది. తెలంగాణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ధర్నా నిర్వహించారు. తక్షణమే  పెంచిన ఛార్జీలను  ఉపసంహరించుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని  హెచ్చరించారు.  
ఈసందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్నా కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.

Back to Top