మే 15న జిల్లా నేతల సమావేశం

హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన మే 15న  విస్తృతస్థాయి సమావేశాలు జరగనున్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నేతలతో శ్రీకాంత్ రెడ్డి సమావేశం కానున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆవరణలో 15వ తేదీ ఉదయం 11 గంటలకు ..మూడు జిల్లాల నేతల సమావేశం జరుగుతుంది. జిల్లా నాయకులు, కార్యకర్తలు ఈసమావేశానికి హాజరవుతారని పార్టీ ప్రధానకార్యదర్శి కె. శివకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.


To read this article in English:  http://bit.ly/27gjItS 

Back to Top