ఘ‌నంగా తెలంగాణ ఆవిర్భ‌వ వేడుక‌లు

హైద‌రాబాద్‌: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి పార్టీ కార్యాల‌యంలో జాతీయపతాకాన్ని  ఎగురువేసిన అనంత‌రం అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడుతూ..పోరాట ఫ‌లిత‌మే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ‌మ‌న్నారు. బంగారు తెలంగాణ సాధ‌న దిశ‌గా మ‌రో పోరాటానికి సిద్ధం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల‌ను కేసీఆర్ అధికారం లోకి వచ్చాక విస్మరించాడని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్ప‌డి రాష్ట్ర గౌర‌వాన్ని మంట‌గ‌లిపార‌ని మండిప‌డ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌న్నారు. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర లేక అప్పుల ఊబిలో కూరుకుపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం మాట‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని, పేద‌ల‌ను ఆదుకోవ‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణాలో నియంతృత్వ పాలనకు ప్ర‌జ‌లు చ‌ర‌మ గీతం పాడే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. వేడుక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కొండా రాఘ‌వ‌రెడ్డి, గ్రేట‌ర్ హైద‌రాబాద్ పార్టీ అధ్య‌క్షులు బోడ్డు సాయినాథ్‌రెడ్డి, ఖ‌మ్మం ఇన్‌చార్జ్ ప్ర‌పుల్లారెడ్డి, ఐటీ ప్రెసిడెంట్ శ్రీ‌వ‌ర్థ‌న్‌రెడ్డి, నాగూర్ క‌ర్నూలు అధ్య‌క్షుడు భ‌గ‌వంతురెడ్డి, ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు ర‌వి కుమార్‌, సేవాద‌ల్ ప్రెసిడెంట్ బండారు వెంక‌ట‌ర‌మ‌ణ‌, మేడ్చల్ అధ్య‌క్షుడు శ్రీ‌నివాస‌రెడ్డి, మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు అమృత‌సాగ‌ర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top