ట్యాంక్‌బండ్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర

హైదరాబాద్, 10 జూన్‌ 2013:

ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టేందుకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌సిద్ధమైంది. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి విఫలమవడంతో తామే ఆ బాధ్యతను తీసుకోవడానికి సమాయత్తమైంది. అసెంబ్లీ వేదికగా ప్రజాగళాన్ని ప్రభుత్వానికి వినిపించడానికి పార్టీ రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు సోమవారం ఉదయం ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర ‌నిర్వహించారు. సోమవారం నుంచి శాసనసభ బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారం‌భమవుతున్న నేపథ్యంలో వారు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Back to Top