వెంకయ్య, బాబులది రెండు నాలుకల ధోరణి

హోదా లాభం కాదంటూనే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు 

రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమైనా తెచ్చారా?

 బాబు మీటింగ్‌లకు వెళ్తే దొంగపనుల
నుంచి తప్పించుకోవడం నేర్పిస్తాడు

వైయస్‌ఆర్‌ సీపీ నేతలు వై. విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్ నారాయణ

 

అనంతపురం: ప్రత్యేక హోదాతో ఏం ఒరిగేదిలేదన్న టీడీపీ ప్రజాప్రతినిధులు హోదా కల్గిన
రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే
వై. విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో బుధవారం
జరిగిన ‘చైతన్యపథం’ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ హోదా నెపంతో అధికారంలోకి వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు
రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  హోదా కంటే ప్యాకేజీ గొప్పదన్న వెంకయ్య మాటలను
రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సమర్ధించడం లేదన్నారు. విభజన తరువాత అన్యాయానికి గురైన
ఏపీలో... ఉద్యోగాలు లేక 40 లక్షల మందికిపైగా నిరుద్యోగులు
రోడ్డునపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌
నిర్వహించిన చంద్రబాబు 10 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని చెప్పి,
ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. అధికార పీఠం ఎక్కిన
చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క
పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని విశ్వేశ్వర్‌రెడ్డి నిలదీశారు. ప్యాకేజీ ద్వారా
పరిశ్రమలు,
ఉద్యోగాలు ఇచ్చే
ధైర్యం టీడీపీకి,
బీజేపీకి ఉందా
అని ప్రభుత్వాలను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కల్గిన హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో 13 సంవత్సరాల్లో వేలకుపైగా పెట్టుబడులు, లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో చెప్పారన్నారు. అలాంటి రాయితీల కోసం
ఏపీ ప్రజానీకం హోదా కావాలంటూ పోరాడుతోందన్నారు. హోదా వస్తే పరిశ్రమలతో రాష్ట్ర
స్వరూపం మారిపోతుందని,
ఒక్కో జిల్లా పారిశ్రామిక
కేంద్రంగా మారుతుందన్నారు. 

 

బీజేపీ,
టీడీపీలకు పుట్టగతులుండవు

హోదా వల్ల లాభమేమిలేదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం సిగ్గుచేటని విశ్వేశ్వర్‌రెడ్డి
విమర్శించారు. లాభం లేనప్పుడు అసెంబ్లీలో రెండు సార్లు శాసనసభ్యులతో తీర్మానం ఎందుకు
చేయించారని ప్రశ్నించారు. ఈ నెల 8వ తేదిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే 7వ తేది అర్థరాత్రి కేంద్రం ప్రకటించిన
ప్యాకేజీని ఎందుకు స్వాగతించారని చంద్రబాబును నిలదీశారు. హోదా కోసం కేంద్రంతో
పోరాడకుండా చంద్రబాబు అర్థరాత్రి వరకు కేంద్రంతో రహస్య చర్చలు జరిపి హోదాను
కాలరాశారని మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు కోట్ల కేసు రాష్ట్రాభివృద్ధిని ముంచిందని
దుయ్యబట్టారు. ఓటుకు కోట్ల కేసుకు భయపడిన చంద్రబాబు పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని
వదిలి తట్టాబుట్టా సర్ధుకొని అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు
అవినీతిపై సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందనే కేంద్రం పెద్దలకు
లొంగుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత స్వార్ధం కోసం బాబు హోదాను తాకట్టుపెట్టారని
చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ మీటింగ్‌లకు వెళితే జైల్లో పెట్టిస్తానని చెప్పిన
చంద్రబాబు,
ఆయన మీటింగ్‌లకు
వెళ్తే దొంగపని చేసినా ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తారని విరుచుకుపడ్డారు.
ఇప్పటికైనా బీజేపీ,
టీడీపీ నేతలు
అబద్దాలు మానుకొని రాష్ట్రాభివృద్ధి కోసం దిగిరావాలని సూచించారు. లేనిపక్షంలో
రాష్ట్ర యువతరం ఆ పార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. 

–––––––––––––––––

హోదా కోసం ప్రతిక్షణం పోరాటం

అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు శంకర్‌నారాయణ

ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిక్షణం ముందుంటుందని
పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ స్పష్టం చేశారు.అనంతపురంలో నిర్వహించిన చైతన్యపథం
కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రరాష్ట్రానికి హోదా సంజీవని అని
పోరాడుతుంటే చంద్రబాబు ప్యాకేజీ గొప్పదని ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
అనంతపురం కరువు జిల్లాలో సాగునీటి సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బాబు పరిపాలనను
గాలికొదిలేశారని ఫైరయ్యారు. హోదా వస్తే లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు
వస్తాయని యువత ఎదురు చూస్తోందన్నారు. అలాంటి హోదాను సాధించకుండా చంద్రబాబు
స్వార్థప్రయోజనాల కోసం కేంద్రానికి తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. ఆడలేక మద్దెల ఓడు
అన్నట్లుగా బీజేపీ,
టీడీపీలు
వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంఘం, నీతి అయోగ్‌ అభ్యంతరాలు అంటూ  హోదాను
నీరుగారుస్తున్నారు తప్పితే, ఒక్క సంతకంతో ప్రత్యేక  హోదా ఇచ్చే శక్తి లేదా
అని ప్రశ్నించారు. 

 

Back to Top