త్వరలో రాజన్న రాజ్యం ఆవిష్కారం: షర్మిల

పిడుగురాళ్ళ:

‘జగనన్న పాలనలో మహానేత రాజన్న రాజ్యం రానుంది. అప్పుడు రైతే రాజు. విద్యార్థుల పైచదువులకు ఢోకా ఉండదు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు, పేదవారికి నెలనెలా రేషన్, పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది అప్పటి వరకు ఓపిక పట్టండని’ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల కోరారు. ఈ దొంగల రాజ్యం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రోజుకో విధంగా పన్నుల భారాన్ని మోపుతోందన్నారు. విద్యుత్తు ఛార్జీలు చెల్లించలేని రైతుల్ని జైలుకు పంపుతోందనీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన టీడీపీ అధినేత చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని మీ కోసం పాదయాత్ర అంటూ కాలక్షేపం చేస్తున్నాడని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ‘మరో ప్రజాప్రస్థానం’పాదయాత్ర గురువారం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామ సమీపంలోని బస కేంద్రం నుంచి ప్రారంభమైంది. దారిలో ఆమెను కలిసిన రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులను అడిగి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. శనగ, మొక్కజొన్న పంటలు నీళ్లు అందక ఎండిపోయాయని రైతులు పోట్లచెరువు నాగేశ్వరరావు, మన్నెం సుబ్బయ్య వివరించారు.

జానపాడులో రచ్చబండ...
    జానపాడులో జరిగిన రచ్చబండలో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం వల్ల నాశనమై పోతున్నామన్నారు. కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. . కరెంటు లేకపోవడంతో చదువులు సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వైయస్ పాలనలో చల్లగా ఉన్నామనీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తన భర్తను బతికించుకున్నాననీ దుర్గ అనే అంగన్‌వాడీ కార్యకర్త వివరించారు. మహిళల సమస్యలు ఆసాంతం విన్న శ్రీమతి షర్మిల జగనన్న వస్తాడు, మీ సమస్యలు తీరుస్తాడు అంటూ భరోసా ఇచ్చారు. ఈ రచ్చబండలో  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కూడా పాల్గొన్నారు. నేరేడు మల్లయ్య అనే వృద్ధుడు గురువారం శ్రీమతి షర్మిలను కలిసి ఆశీర్వదించాడు. మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాననీ, ఈ రోజు ఆమెను కలవగలిగాననీ ఆనందం వ్యక్తం చేశాడు.

విద్యార్థులతో మాటామంతి..
    మధ్యాహ్నం భోజన విరామం తరువాత పిడుగురాళ్లలోని నవీన విద్యాసంస్థల విద్యార్థులతో షర్మిల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్సుమెంట్ సక్రమంగా అందడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై షర్మిల మాట్లాడుతూ జగనన్న సీఎం అయిన తరువాత మీ చదువులకు ఢోకా లేకుండా ఫీజురీయింబర్సుమెంట్ పథకం మళ్లీ వస్తుందని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి బయలుదేరగా, పిడుగురాళ్ల ఐలాండ్ సెంటర్ వద్ద భారీ ఎత్తున స్వాగతం లభించింది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, పిడుగురాళ్లలో తాగునీటి సమస్య పరిష్కారానికి మహానేత డాక్టర్ వైయస్ చేసిన కృషిని గుర్తు చేశారు.

      పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత, గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నాయకులు యెనుముల మురళీధరరెడ్డి, డాక్టర్ నన్నపనేని సుధ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, బీసీ సెల్ జిల్లా కన్వీనరు దేవెళ్ల రేవతి, ఎస్‌సీ సెల్ కన్వీనరు బండారు సాయిబాబు, నూనె ఉమామహేశ్వరరెడ్డి,అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన పిడుగురాళ్ల...
     శ్రీమతి షర్మిల పాదయాత్ర పిడుగురాళ్ళకు చేరడంతో పట్టణమంతా జనసంద్రంగా మారింది. రాజన్న బిడ్డను చూసేందుకు, ఆమెకు తమ సమస్యలను విన్నవించుకునేందుకు పట్టణానికి జనం పోటెత్తారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి పోయూయి

Back to Top