త్వరలో పార్టీలో చేరతా: శ్రీహరి

హైదరాబాద్, 08 ఫిబ్రవరి 2013:

  ప్రముఖ సినీ నటుడు శ్రీహరి శుక్రవారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన చంచల్‌గుడా జైలుకు వెళ్ళారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచినట్లే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసిన నడుస్తానని శ్రీహరి చెప్పారు. కుమ్మక్కు రాజకీయాలు తెలియని ఒకే ఒక్క నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదనీ, త్వరలోనే పార్టీలో చేరతాననీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి పనికీ తన మద్దతు ఉంటుందన్నారు. ప్రజల స్థితిగతుల్ని బాగుచేయగల సత్తా ఒక్క శ్రీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని శ్రీహరి స్పష్టంచేశారు.

Back to Top