తుర్కయాంజాల్‌ చేరుకున్న షర్మిల

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించేందుకు శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం 10.30  గంటలకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ చేరుకున్నారు. తుర్కయాంజాల్‌లోని ఎస్‌ఎస్‌ఆర్‌ గార్డెన్సు నుంచి మరి కొద్ది సేపటిలో ఆమె పాదయాత్రను పునః ప్రారంభిస్తారు. మోకాలి గాయం కారణంగా గడచిన డిసెంబర్‌ 15వ తేదీన ఆమె తన పాదయాత్రకు విరామం ఇచ్చిన ప్రాంతం నుంచే ఈ రోజు మళ్ళీ ప్రారంభిస్తున్నారు.

అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, అవిశ్వాస తీర్మానంతో గద్దె ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా స్వలాభం కోసం కాంగ్రెస్‌పార్టీతో అంటకాగుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ చారిత్రక పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను విజయవంతం చేసేందుకు రంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి కూడా అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తుర్కయాంజాల్‌ చేరుకున్నారు.
Back to Top