జల దీక్షను విజయవంతం చేద్దాం

కర్నూలు) ఈ నెల 16 నుంచి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్
చేపట్టిన జల దీక్ష ను విజయవంతం చేద్దామని కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా
నియమితులైన గౌరు వెంకట రెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షునిగా
నియమితులైన తర్వాత ఆయన సీనియర్ నాయకులతో కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం
అయ్యారు. పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే
ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టి. సురేందర్ రెడ్డి తదితరులతో
పార్టీ వ్యవహారాలు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో జరిగే జల
దీక్ష ను విజయవంతం చేయటానికి పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపు ఇచ్చారు.
నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్ని ఎప్పటికప్పుడు కలుపుకొంటూ పనిచేయాలని
సూచించారు.

 

Back to Top