వాస్తవాలు బయట పెట్టండి

హైదరాబాద్)) నల్లధనం వెల్లడికి సంబంధించి వాస్తవాలు మాట్లాడాలని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పార్థ సారధి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ పథకంలో సమాచారం అంతా గోప్యం అని చెప్పారని, కానీ చంద్రబాబు ఆయన మంత్రివర్గ సహచరులు ఈ వివరాలు అంటూ ఉటంకిస్తూ మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యం అయింది అనేది స్పష్టం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో కూరుకొని పోయిన బాబు, ఇతరులకు ఆ మరక అంటించేందుకు తాపత్రయ పడుతున్నారని పార్థ సారధి పేర్కొన్నారు.

Back to Top