చంద్రబాబు మార్కు జిమ్మిక్కులు

తెలుగు తమ్ముళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుకొనేందుకు టెక్నిక్కులు
ప్రభుత్వం తరపున వేగంగా మౌళిక వసతుల్ని కల్పించే ఎత్తుగడలు
ఇందుకు వీలుగా ముఖ్యమంత్రి పర్యటనల్ని ఏర్పాటు చేస్తున్న వైనం

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ దందాను నడిపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల వెంచర్ కోసం చంద్రబాబు తన పర్యటనల్ని వాడుకొంటున్నారు. చాలా పకడ్బందీగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ ఒప్పందాలు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగు తమ్ముళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఇది నడుస్తోంది. టీడీపీ నాయకులు కూడబలుక్కొని దగ్గర దగ్గరగా వెంచర్లు వేసుకొనేలా జాగ్రత్త పడుతున్నారు. పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేశాక అప్పుడు ఆ ప్రాంతానికి మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద ఉంటుంది. అంటే రోడ్లు వేయటం, విద్యుత్ స్థంభాలు పాతించటం, పార్కులు వంటివి ఏర్పాటు చేయటం ద్వారా ఆయా వెంచర్ల లోని ప్లాట్లు వేగంగా అమ్ముడవుతాయి.

ప్రభుత్వం తరపున సౌకర్యాలు
తెలుగు తమ్ముళ్ల వెంచర్లు ఏర్పాటు అయిన తర్వాత అసలు డ్రామా మొదలవుతోంది. ప్రభుత్వం ఆ వెంచర్లకు దగ్గరగా ఏదో ఒక అంశానికి శ్రీకారం చుడుతోంది. దీంతో సహజంగా అక్కడ ఏదో పెద్ద ఎత్తున జరిగిపోతోంది, అభివ్రద్ది అంతా అక్కడకు పరుగున వచ్చేస్తుంది అన్న రీతిలో ప్రచారం జరగుతుంది. అంతే గాకుండా ముఖ్యమంత్రి లేదా సీనియర్ మంత్రుల పర్యటన పేరు చెప్పి అక్కడకు రోడ్లు, విద్యుత్ స్థంభాలు ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. కేవలం శంకుస్థాపన లేదా భూమి పూజ వంటి వాటికి కూడా పెద్ద ఎత్తున ఆర్భాటం చేయటంలోని ఆంతర్యం ఇదే అని తెలుస్తోంది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తించటం, మౌళిక వసతుల్ని ఏర్పాటు చేయటం.. వంటివన్నీ ప్రభుత్వ ఖర్చులతో జరిగిపోతాయి. దీంతో తెలుగు తమ్ముళ్ల వెంచర్లలోని భూములకు పెద్ద ఎత్తున రెక్కలు వచ్చేస్తున్నాయి.

చంద్రబాబు పర్యటనతో బయట పడిన అసలు రంగు
అనంతపురం జిల్లా లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనతో ఈ విషయం మరోసారి రుజువైంది. నగరంలోని 36వ డివిజన్ లో సీఎం పర్యటన్ని ఏర్పాటు చేశారు. ఈ వంకతో హడావుడిగా రోడ్లు, విద్యుత్ స్థంభాలు, పార్కులు ఏర్పాటు చేశారు. వారం, పది రోజుల వ్యవధిలోనే దాదాపు రూ. 2 కోట్ల రూపాయిల ఖర్చుతో మౌళిక వసతుల్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు వచ్చి కొద్దిసేపు గడిపి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ మౌళిక వసతుల్ని చూపించి స్థానిక శ్రీనగర్ కాలనీ ప్రాంతంలోని దాదాపు 30 ఎకరాల భూ భాగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొంటున్నారు. మొన్నటి దాకా సెంటు రూ. 6-7 లక్షలు పలికే భూమి ఇప్పుడు రూ. 8-10 లక్షలకే  పెంచుకొన్నారు.  చేతికి మట్టి అంటుకోకుండా ప్రభుత్వం చేత డబ్బు ఖర్చు పెట్టి తెలుగు తమ్ముళ్లు వ్యాపారం చేసుకొంటున్నారు. 


తాజా వీడియోలు

Back to Top