వైయస్సార్సీపీలోకి టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి

  • తెలంగాణలో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు
  • వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత
  • వైయస్ఆర్ కుటుంబంపై అభిమానంతోనే పార్టీలో చేరిన లక్కినేని, అనుచరులు
  • లక్కినేని సుధీర్ పార్టీలో చేరడం అభినందనీయంః గట్టు
హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు రెండు రాష్ట్రాల ప్రజలు అమితాసక్తి చూపుతున్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నారు.  తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి లక్కినేని సుధీర్, ఆయన అనుచరులు లోటస్ పాండ్ లో పెద్ద ఎత్తున అధినేత వైయస్ జగన్ సమక్షంలో  పార్టీలో చేరారు. వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. 

లక్కినేని సుధీర్...
ఖమ్మ జిల్లాలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి దయతో గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ పార్టీని వీడడం శోచనీయమని సుధీర్ అన్నారు. వైయస్ఆర్ అంటే తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని, ఆయనతో కలిసి పాదయాత్రలోనూ తాము పాల్గొన్నామని సుధీర్ చెప్పారు. వైయస్ఆర్ కుటుంబంపై ఉన్న అభిమానంతోనే టీఆర్ఎస్ కు రాజీనామా చేసి జగన్ అన్న పార్టీలో చేరానని సుధీర్ చెప్పారు.

గట్టు శ్రీకాంత్ రెడ్డి..
తెలంగాణలో రైతులు, కార్మికులు, ప్రతీ వర్గాన్ని ఆదుకున్న మహానేత వైయస్ఆర్ అని...ఆయన నాయకత్వంపై నమ్మకంతో ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చారని టీ వైయస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ వచ్చాక మహానేత చేపట్టిన సంక్షేమ పథకాలను ఏవిధంగా విస్మరించిందో ప్రజలంతా గమనించారన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో వైయస్ఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. లక్కినేని సుధీర్ పార్టీలో చేరడం అభినందనీయమని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఖమ్మంలో ముందుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 
Back to Top