ఆదివాసీల పొట్టగొడుతున్న టీఆర్ఎస్

హైదరాబాద్‌: ఆదివాసీల పోడు భూములపై ప్రభుత్వ పెద్దలు, టీఆర్‌ఎస్‌ నేతలు కన్నేయడం దారణమని టీ వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజనులు, ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు.  గిరిజనులు, ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూములను ...ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు లీజుకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బదీయొద్దని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.

Back to Top