సమస్యల వలయంలో రాజమహేంద్రవరం

తూర్పుగోదావరిః   రాజమహేంద్రవరం సమస్యల వలయంలో  కొట్టుమిట్టాడుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. అవగాహన రాహిత్యంతో పరిపాలన కొనసాగుతుందని దుయ్యబట్టారు.  రాజమండ్రిలో తాగునీటికి కటకట ఏర్పడుతుంటే పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆదిరెడ్డి అప్పారావు మండిపడ్డారు.  టీడీపీకి ఓ యాక్షన్ ప్లాన్ అంటూ లేకపోవడం శోచనీయమన్నారు. వాటర్ ట్యాంకర్ లు లేవు, డ్రైవర్ లు లేరంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ కృషిచేస్తుందని చెప్పారు. త్వరలో వైఎస్సార్సీపీ వార్డు పర్యటనలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా ముందుకు వెళ్తుందన్నారు.

Back to Top