పేదల గుండెల్లో చిరస్థాయిగా వైయస్‌ఆర్‌...

విజయవాడః పేదరికాన్ని రూపుమాపేందుకు వైయస్‌ఆర్‌ కృషి మరువలేనిదని వైయస్‌ఆర్‌సీపీ నేతల పార్థసారధి అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి   సందర్భంగా నివాళర్పించారు. రాష్ట్రానికి పెద్దకొడుకుగా వైయస్‌ఆర్‌ పాలించారని మల్లాది విష్ణు అన్నారు. పేదల గుండెల్లో ఎప్పటికీ వైయస్‌ఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వైయస్‌ఆర్‌ అడుగుజాడల్లో వైయస్‌ఆర్‌సీపీ నడుస్తుందన్నారు. ఎటువంటి అడ్డంకి కాన్నప్పటికీ  కంట్రోల్‌రూం వద్ద వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని తొలగించారని, మహనీయుల త్యాగాల గుర్తుగా ఉన్న విగ్రహాలను తొలగించడం దారుణమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే తొలగించిన స్థానంలో వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా, వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, గౌతమ్‌ రెడ్డి, బొప్పన భవకుమార్, ఎంవీఆర్‌ చౌదరి, తుమ్మల చంద్రశేఖర్, పైలా సోమినాయుడు, పలువురు కార్పొరేటర్లు, అభిమానులు పాల్గొన్నారు.
Back to Top